Padamulu Chalani Prema Idi



పల్లవి: పదములు చాలని ప్రేమ ఇది-స్వరములు చాలని వర్ణననిది...."2" 
కరములు చాపి నిను కౌగలించి పెంచిన కన్నవారికంటే ఇది మిన్న ఐన ప్రేమా.....
వారిని సహితము కన్న ప్రేమ 
..: ప్రేమా ఇది యేసు ప్రేమా-ప్రేమా ఇది తండ్రి ప్రేమ-ప్రేమా ఇది ప్రాణమిచ్చిన
              ప్రేమా కల్వరి ప్రేమ                 "పదములు" 
1. నవమాసము మోసి, ప్రయోజకులను చేసిన-కన్న బిడ్డలె నిన్ను వెలివేసినా "2"
తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
-ఆవేదనంత తొలగించెడి ప్రేమ             "ప్రేమా" 
2. మేలులెన్నొ పొంది ఉన్నత స్థితికెదిగినా స్నేహితులె హృదయమును గాయపరచగా "2"
మేలులతో నింపి అద్భుతములు చేసి-క్షమియించుట నేర్పించెడి ప్రేమా...
-శాంతితో నిను నడిపించెడి ప్రేమ          "ప్రేమా"


Share on Google Plus

About Youth Fellowship

Note: if you are blessed by this message then pass it on to as many as possible and share this blessed message
    Blogger Comment
    Facebook Comment

0 comments :

Post a Comment